ప్రభు స్తుతి

   ప్రభు స్తుతి

   ఓ ప్రభువా!

       సర్వపోషకా!

    సర్వ రక్షకా!

   నీవు ఆదియును

       అంతమును లేని వాడవు:

       అద్వయుడవు.

       నిరుపమానుడవు:

       నీ ప్రమాణ మెవ్వరును

       యెఱుంగ నేరరు.

   నీవు వర్ణము

        నామము

    రూపము

    గుణములు, లేని వాడవు.

   నీవు అపరిమితుడవు

    గంభీరుడవు

       ఊహాతీతుడవు

      భావనాతీతుడవు

    శాశ్వతుడవు

     నాశనము లేని వాడవు.

   నీవు అవిభాజ్యుడవు

    దివ్య చక్షువులతో గాని

    నిన్నెవరునుచూడ జాలరు

   నీవు ఎల్లప్పుడు నుంటివి

    నీవు ఎల్లప్పుడు నున్నావు

    నీవు ఎల్లప్పుడు నుందువు

    నీవు అంతట గలవు

    నీవు అన్నింట నున్నావు

    మరి నీవు అంతటికి, అన్నింటికి

    ఆవల కూడా నున్నావు.

    నీవు ఆకాశమున గలవు

    పాతాళమున గలవు

       నీవు వ్యక్తుడవు

    అవ్యక్తుడవు

    నీవు అందరిలోను ఉన్నావు

    అందరూ నీలో నున్నారు.

        నీవు పరలోక రాజ్యమందే కాక

        సర్వ లోకాలలో నున్నావు.

   నీవు అగోచరుడవు

స్వతంత్రుడవు

    నీవు సృష్టి కర్తవు

    ప్రభులకు ప్రభుడవు

    అందరి మనస్సులను

    హృదయములను ఎరిగిన వాడవు

నీవు సర్వ శక్తి మంతుడవు

    సర్వవ్యాపివి

    నీవు అనంత జ్ఞానము

    అనంత శక్తియు   

    అనంత ఆనందమును    

నీవు జ్ఞాన సాగరుడవు

    సర్వజ్ఞుడవు

    అనంత జ్ఞానివి

నీవు భూతభవిష్యద్వర్తమానములు

 ఎరిగిన వాడవు

    జ్ఞానమే నీవు

    నీవు సర్వదయాళుడవు

    నిత్య శుభంకరుడవు

నీవు ఆత్మల కెల్ల నాత్మవు

    అనంత గుణ విశిష్ణుడవు

    నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి

నీవు సత్యమునకు మూలము

    ప్రేమ మహాసాగరుడవు

    నీవు సనాతన పురుషుడవు

    సర్వోత్తముడవు

    నీవు ప్రభుడవు

    పరిశుద్ధుడవు.

నీవు పరుడవు

    పరాత్పరుడవు

    నీవు సర్వుడవు

    సర్వసాక్షివి

    నీవు సత్య స్వరూపుడవు

    సత్య సాక్షివి

    నీవే మార్గమును  సత్యమును జీవమును

    ప్రియతముడైన భగవంతుడవు

    నీవు యెహోవా అనబడు ఏకైక పూజ్యుడవు